ఆధార్ రూల్స్ లో మార్పులు.. కేంద్రం చేసిన మార్పులివే..!

-

మనకు వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. తాజాగా కేంద్రం ఆధార్ రూల్స్ ని మార్చింది. అయితే రూల్స్ ప్రకారం చూస్తే ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి పదేళ్లలో ఒక సారి అయినా డాక్యుమెంట్స్ ని అప్డేట్ చెయ్యాలి. ఆధార్ అకౌంట్‌హోల్డర్లు సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్డేట్ చెయ్యాలి.

ఇక పూర్తి వివరాలను చూస్తే.. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ ఆధార్ సంబంధిత సమాచారం కచ్చితత్వాన్ని కొనసాగించడానికి అప్డేట్ చెయ్యాలి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్న తేదీ నుంచి పదేళ్లలో ఓసారి సపోర్టింగ్ డాక్యుమెంట్లను ఆధార్ వున్నవాళ్లు అప్డేట్ చెయ్యాలి.

ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రెస్ ని సబ్మిట్ చేసి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. సమాచారం కరెక్ట్ గా ఉండేందుకు ఈ డాక్యుమెంట్స్ ని పక్కా ఇవ్వాలి. ఈ విషయాలని గెజిట్ నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ పేర్కొంది. రూల్స్ ని సవరించడం ద్వారా ఈ మార్పులు చేసారు. పదేళ్ల క్రితం ఆధార్ నెంబర్ ని తీసుకున్న వారంతా అప్‌డేట్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్, రెసిడెన్షియల్ ప్రూఫ్ డాక్యుమెంట్లను వెంటనే అప్డేట్ చెయ్యాలి. అందుకే ‘అప్‌డేట్ డాక్యుమెంట్’ అనే ఈ కొత్త ఫీచర్‌ను యూఐడీఏఐ డెవలప్ చేసి ఆధార్ హోల్డర్లకు ఇస్తోంది. 134 కోట్ల ఆధార్ నెంబర్లను యూఐడీఏఐ ఇప్పటి దాకా జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news