తెలంగాణకు ప్రధాని మోడీ మళ్ళీ, మళ్ళీ వస్తాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అధినేత స్వాగతం పలకాల్సింది పోయి.. ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నామని.. తెలంగాణకు ద్రోహం చేసే, నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. సీఎం కి తెలంగాణ అభివృద్ధి పట్టదు… తన కుటుంబం ముఖ్యమని.. తెలంగాణ అమరుల ఆకాంక్షల కు విరుద్ధంగా సీఎం పాలన సాగుతుందని వెల్లడించారు.
రోడ్ల మీద ఫ్లెక్సీ లు పెట్టీ ఏమి సాధించాలని అనుకుంటున్నారని..ప్రధాని మళ్ళీ మళ్ళీ వస్తాడు..వేల కెసిఆర్ లు వచ్చిన మోడీ ని అడ్డుకోలేరని సవాల్ చేశారు.
కిరాయి మనసులతో బ్యానర్ లు కట్టి మోడీ నీ అడ్డుకోలేరు..ట్రైబల్ మ్యూజియం కి ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదని కెసిఆర్ పై ఫైర్ అయ్యారు. సైన్స్ సిటీ కి లాండ్ ఇవ్వడం లేదని.. ఎంఎంటీఎస్ రెండో దశ కు సహకరించ కుండా అడ్డుకుంటుందని కేసీఆర్ అని..కల్వకుంట్ల కుటుంబానికి భయపడమన్నారు.