ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… ఇలా ఆధార్ ని అప్డేట్ చేసుకోవచ్చు..!

-

మనకున్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వలన ఎన్నో లాభాలు వున్నాయి. బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడానికి మొదలు స్కీమ్స్ లో డబ్బులు పెట్టడానికి కూడా ఆధార్ అవసరం. అయితే ఆధార్ కార్డు ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు కూడా మీ ఆధార్ ని అప్డేట్ చెయ్యాలా..? అయితే ఇది చూడండి.

ఏపీ లో ఆధార్‌కు సంబంధించి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. ఈ నెల 27 నుంచి నాలుగు రోజులు పాటు ఆధార్‌ సేవలు అందుబాటులో వున్నాయి.

గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్‌ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. కనుక ఆధార్ కార్డు ని అప్డేట్ చేసుకోవాలంటే అక్కడకి వెళ్ళచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లోనూ అప్డేట్ చేస్తారు. ఈ ఛాన్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 వేల మందికి పైగా మంది వినియోగించుకున్నారు. అయితే ఇంకా ఎవరైనా ఉంటే వారి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు ఐదేళ్లు దాటితే ఆధార్‌ లో వేలిముద్రలు అప్ డేట్ చెయ్యాలి. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ వేలిముద్రలను అప్ డేట్ చెయ్యాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version