కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ “ఆప్” పోటీ… గట్టి పోటీ ఇస్తుందా ?

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా రాజకీయాలలో ఎదిగాడు అన్నది తెరిచిన పుస్తకమే. ఒకప్పుడు కేవలం ఢిల్లీ కి మాత్రమే పరిమితం అయిన ఆప్ పార్టీని దేశమంతా విస్తరింపచేయడానికి కేజ్రీవాల్ టీమ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే పంజాబ్ లో విజయం సాధించడం. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మే 10 నుండి జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కూడా పోటీ చేయనుందట.

ఇది ఒక విధంగా మిగిలిన పార్టీలకు షాక్ అని చెప్పాలి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని కన్ఫర్మ్ చేశారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ , ఉద్యోగాల్లో 80 శాతం లోకల్ రిజర్వేషన్, మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ లాంటి పది హామీలను తమ ఎన్నికల మానిఫెస్టో లో పొందుపరిచారు. కానీ కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లదే హవా అంతా… ఈ సందింట్లో ఆప్ ఒక్క సీట్ అయినా గెలుస్తుందా ?

Read more RELATED
Recommended to you

Latest news