తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు మంత్రి హరీష్ రావు. వచ్చే నెల నుంచే కొత్త ఫించన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి నాయకుల కళ్లకు పచ్చకామెర్లు సోకినాయని.. రాష్ట్రంలో అమలు అవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదా అని మండిపడ్డారు.
ఏడు సంవత్సరాల బిజెపి పాలనలో సామాన్యుల పై ధరల మోతలు పెంచారని.. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా ? అని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. తెలంగాణలో ఉన్నన్ని రెసిడెన్సియల్ పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా ? అని ఆగ్రహించారు.
బిజెపు నాయకులు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారని… పక్క రాష్ట్రం కర్ణాటకలో కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. 5 గంటల కరెంట్ కూడా ఇయ్యలేని దుస్థితిలో బిజెపి ఉందని… బిజెపి గ్లోబల్ ప్రచారానికే పరిమితమై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు. బిజెపి పార్టీ మతకల్లోలాలు సృష్టిస్తోందని.. సంక్షేమాన్ని విస్మరిస్తుందన్నారు. అధిక ధరలు పెంచిన బిజెపి పార్టీ ఆ పార్టీ నాయకులు పాద యాత్రలు చెయ్యడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.