Breaking : మిరపకు రికార్డు ధర.. ఎంతంటే..?

-

నిన్న ఏసీ మిరపకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి క్వింటాలుకు ఏకంగా రూ. 22,800 చొప్పున పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏసీ రకం మిర్చిని అల్లిపురానికి చెందిన రావూరి సత్యనారాయణ అనే రైతు పండించాడు. ఈ నేపథ్యంలో.. రావూరి సత్యనారాయణ పండించిన మిరప పంటను ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. రావూరి సత్యనారాయణ తీసుకువచ్చిన 22 బస్తాల మిర్చిని క్వింటాలుకు రూ. 22,800 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు.

Best Ac Quality armoor Guntur Dry Red Chilli, Cool, With Stem, Rs  120/kilogram | ID: 22385531412

మార్కెట్‌కు మొత్తం 5,546 బస్తాల ఏసీ మిరప బస్తాలు రాగా, ఎండు మిరప 2,058 బస్తాలు, తాలు మిరప 265 బస్తాల సరకు వచ్చినట్టు తెలిపారు మార్కెట్ అధికారులు. కాగా, తేజ రకం మిర్చికి అత్యధిక ధర పలుకుతుండడంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరుకును కూడా తెచ్చి విక్రయిస్తున్నారు. కాగా, ఈ నెల 1న ఏసీ మిరప క్వింటాలుకు రూ.22 వేలు పలకింది. కాగా, మార్కెట్లు నిన్న మిరప కనిష్ఠ ధర రూ. 17,600గా ఉండగా, నమూనా ధర రూ. 20వేలు పలికడం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news