కేంద్రం నుండి సూపర్ స్కీమ్… రూ.55 కడితే… ప్రతీ నెలా మూడు వేలు…!

-

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి. చాలా మంది ఈ స్కీమ్ ప్రయోజనాలని పొందుతున్నారు. తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు. నెలకు రూ. 15 వేల లోపు ఆదాయం ఉంటే ఈ స్కీమ్ లో చేరచ్చు.

ఈ స్కీమ్ లో చేరితే కచ్చితమైన రాబడి వస్తుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూసేస్తే.. పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన లో చేరితే ప్రతి నెలా కొంత మొత్తం దీనిలో పెట్టాల్సి వుంది. నెలకు రూ. 55 నుంచి పెట్టవచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే… 18 నుంచి 40 ఏళ్ల వయసులో వారు ఈ స్కీమ్‌లో చేరచ్చు.

40 ఏళ్లు దాటితే ఈ పథకంలో చేరేందుకు కుదరదు. స్ట్రీట్ వెండర్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, టైలర్స్, రిక్షా నడిపే వారు, కన్‌స్ట్రక్షన్ వర్కర్లు, బీడి వర్కర్లు వీరంతా కూడా ఈ స్కీమ్ కి అర్హులే. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెలా కూడా రూ. 3 వేలు ని పెన్షన్ గా పొందొచ్చు. ఒకవేళ కనుక వ్యక్తి మరణిస్తే.. అప్పుడు భాగస్వామికి 50 శాతం పెన్షన్ ని ఇస్తారు.

18 ఏళ్ల వయసు వారు నెలకు రూ. 55 చెల్లిస్తే చాలు. అప్పుడు మూడు వేలు పెన్షన్ మీకు వస్తుంది. నెలకు గరిష్టంగా రూ. 200 వరకు చెల్లించాల్సి వుంది. అయితే వయస్సు ని బట్టీ చెల్లించాలి. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈజీగా ఈ స్కీమ్ లో చేరచ్చు. ప్రతి నెలా రూ 3 వేలు పెన్షన్ మీకు అప్పుడు వస్తుంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ఉంటే చాలు స్కీమ్ ని ఓపెన్ చెయ్యచ్చు. ఈ పథకం లో చేరితే శ్రమ్ యోగి కార్డు ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news