మాస్ మహారాజా రవితేజ కు ఆక్సిడెంట్.. ఆందోళనలో అభిమానులు..!!

-

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సూపర్ స్పీడ్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈయన ఐదు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇక జయాపజయాలను లెక్కచేయకుండా కథ నచ్చితే సినిమా చేస్తూ వెళుతున్న రవితేజ ఇటీవల ఆయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని వార్తలు వస్తుండటంతో తన అభిమానులు సైతం కంగారుపడుతున్నారు

మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రోప్ స్కిడ్ కావడంతో రవితేజ గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం జరిగి ఇప్పటికే రెండు రోజులు అవుతోంది అని, ఈ విషయాన్ని బయటకు తెలియకుండా చిత్రం యూనిట్ జాగ్రత్త పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి రవితేజను తరలించగా 10 కుట్లు కూడా పడ్డాయని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇంత జరిగినా కూడా విశ్రాంతి తీసుకోకుండా రవితేజ షూటింగ్ కి హాజరు అవుతూ ఉండడం.. యాక్షన్ సీన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తూ ఉండడంతో ఆయన డెడికేషన్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డేట్స్ ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతోనే యాక్షన్ సీన్స్ ను పూర్తిచేయాలని రవితేజ డిసైడ్ అయ్యారట. అందుకే రవితేజ గాయాలపాలైనా కూడా షూటింగ్లో పాల్గొనడం చూసి అందరూ ఆశ్చర్య పోవటమే కాకుండా ఆయనను మెచ్చుకుంటున్నారు కూడా. ఇక ఇంత డెడికేట్ గా రవితేజ పని చేస్తారు కాబట్టి ఈ వయసులో కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news