ప్చ్‌.. ఎమ‌య్యా కొర‌టాలా..?? పార్టీ సాంగ్ అంటివి

-

మెగాస్టార్ చింర‌జీవి ఆచార్య మూవీ నుండి హైహోల్టేజ్ పార్టీ సాంగ్ అంటూ 31న ఊరించి జన‌వ‌రి మూడున అంటూ పోస్ట‌ర్‌తో స‌రిపెట్టిన డైరెక్ట‌ర్ కొర‌టాలపై మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. పాట వ‌చ్చి ఉంటే ర‌చ్చ ర‌చ్చగా ఎంజాయ్ చేస్తూ జాత‌ర చేసేవాళ్లం క‌దా..? ఎమ‌య్యా రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్‌పై ప‌డి ఆచార్య‌ను ప‌క్క‌న పెట్టేశావేంటి..? ఇది న్యాయ‌మేనా అంటూ నిట్టూరుస్తున్నారు.

భీమ్లానాయ‌క్ నుంచి లాలా డీజే వెర్ష‌న్ వ‌స్తుందిగా దాంతో స‌ర్దుకుపొదామంటూ మ‌రికొంద‌రు మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బీమ్లానాయ‌క్ లాలా లాలా డీజే వెర్ష‌న్ 7 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు.

ఇక ఆచార్య విష‌యానికి వ‌స్తే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద పాత్ర‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి.

సురేఖ్‌ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ , రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. స్వ‌ర మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ చాలా కాలం త‌రువాత చిరు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా 2022 మార్చిలో విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version