ఏపీలో కరెంట్‌ కోతలు ఉండకుండా చర్యలు – వైఎస్ జగన్

-

ఏపీలో కరెంట్‌ కోతలు ఉండకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి. విద్యుత్ శాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించండని.. విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలని కోరారు. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలని… ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

వ్యవసాయ మెటార్ల పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మోటార్లపై రైతులకు లేఖలు రాయండని.. వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు చెప్పండని ఆదేశాలు జారీ చేశారు. రైతు పై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించిండని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news