ఆదిలాబాద్‌లో గులాబీకి కమలం దెబ్బ..హోరాహోరీ!

-

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సారి రాజకీయ పోరు రసవత్తరంగా సాగేలా ఉంది. ఇక్కడ మూడు పార్టీల మధ్య వార్ నడిచేలా ఉంది. కాకపోతే మెజారిటీ సీట్లలో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్యే ఫైట్ జరిగేలా ఉంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొదట నుంచి కాంగ్రెస్ మంచి విజయాలు సాధించేది. అలాగే టీడీపీ సైతం కొన్ని విజయాలు అందుకుంది. ఇక 2014 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటుని బి‌ఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కానీ 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా బి‌జే‌పి గెలుచుకుంది.

అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పరిధిలో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటింది. 2018 ఎన్నికలకు వస్తే..ఆదిలాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒక ఆసిఫాబాద్ లోనే కాంగ్రెస్ గెలవగా మిగిలిన ముధోల్, సిర్పూర్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. ఆసిఫాబాద్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో ఏడు స్థానాలు బి‌ఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నాయి.

కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో బి‌జే‌పి గెలవడంతో సీన్ మారిపోయింది. ఊహించని విధంగా అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం మారింది. కేవలం సిర్పూర్, ఆసిఫాబాద్ లోనే బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం రాగా, ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది. బోథ్, ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్ స్థానాల్లో బి‌జే‌పికి లీడ్ వచ్చింది.

అంటే ఇప్పుడు ఆయా స్థానాల్లో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయి. నిర్మల్ లో త్రిముఖ పోరు జరిగే అవకాశాలు ఉండగా, బోథ్, ముధోల్, ఆదిలాబాద్ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి మధ్య పోరు ఉంటుంది. అటు ఖానాపూర్, ఆసిఫాబాద్ ల్లో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు ఉండే ఛాన్స్ ఉంది. సిర్పూర్ లో సైతం కాంగ్రెస్-బి‌ఆర్‌ఎస్ పార్టీల మధ్య పోరు జరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే ఆదిలాబాద్ లో ప్రధాన పోరు మాత్రం బి‌జే‌పి-బి‌ఆర్‌ఎస్ ల మధ్య ఉండేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news