బ్యూటిఫుల్ హీరోయిన్ అదితిరావు హైదరి..మలయాళం, హిందీ, తమిళ్, మరాఠీ భాషల్లో సినిమాలు చేసిన తర్వాతనే తెలుగులోకి వచ్చింది. ‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ..ఒకే ఒక్క సినిమాతో చక్కటి పేరు సంపాదించుకుంది. అదితిరావు హైదరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయే కానీ, ముంబైలో ఉంటోంది.
తెలుగు ప్రేక్షకులకు చివరగా ఈ సుందరి ‘మహా సముద్రం’ చిత్రంలో కనిపించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అదితిరావు హైదరి మళ్లీ సరైన కమ్ బ్యాక్ తెలుగు సినిమాల్లో ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సంగతులు పక్కనబెడితే..అదితిరావు హైదరి స్కిన్ షోకు కొంచెం దూరంగానే ఉంటారు. కాగా, ఈమె హాట్ ఫొటోలు ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. హాట్ థైస్ చూపుతూ అందాలన్నీఅలా ఆరబోస్తూ బ్లాక్ స్కర్ట్ లో అలా చూపులతోనే కైపెక్కిస్తోంది అదితిరావు.
ఈ ఫొటో చూసి నెటిజన్లు వావ్, …లవ్ యూ అదితి, బ్యూటిఫుల్ హీరోయిన్ అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఈ భామ నటించిన తొలి చిత్రం ‘సమ్మోహనం’ సూపర్ సక్సెస్ అయింది.
అదితిరావు నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ద గర్ల్ ఆన్ ది ట్రెయిన్’ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ సుందరి..‘అజీబ్ దాస్తాన్స్’ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ లో బోల్డ్ రోల్ ప్లే చేసి చక్కటి ప్రశంసలు పొందింది.