షర్మిల వర్సెస్ బీఆర్ఎస్: మళ్ళీ రచ్చ..అరెస్ట్.!

-

మరొకసారి తెలంగాణలో షర్మిల వర్సెస్ బి‌ఆర్‌ఎస్ శ్రేణులు అన్నట్లు వార్ నడిచింది. తాజాగా మహబూబాబాద్‌లో పాదయాత్ర చేస్తున్న షర్మిల..అక్కడ స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై తీవ్ర స్థాయిలో వీరుచుకుపడ్డారు.  కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేయగా, శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ షర్మిల సవాల్ విసిరారు.

పాదయాత్రను అడ్డుకునేలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారని, మీ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు ఆడుతున్నారని, శంకర్ నాయక్ ఒక కబ్జా కోర్ అని, జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసని షర్మిల..శంకర్ నాయక్ టార్గెట్ గా వీరుచుకుపడ్డారు. దీంతో బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహానికి లోనై..షర్మిల బస చేసిన ప్లేస్‌కు వెళ్ళి..అక్కడ వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం దగ్గర ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

Sharmila: పాదయాత్రలో షర్మిల అరెస్ట్.. హైదరాబాద్ తరలించే అవకాశం

ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి… వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. తన కారవాన్ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలో ఎక్కించి హైదరాబాద్ తీసుకెళ్లారు. అలాగే  షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు షర్మిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

అయితే గతంలో నర్సంపేట ఎమ్మెల్యేపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో..అక్కడ షర్మిల పాదయాత్రపై రాళ్ళ దాడి జరిగింది. ఈ క్రమంలోనే షర్మిలని పోలీసులు అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌కు పంపారు. తర్వాత పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవడంతో..పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ రచ్చ జరగడంతో పాదయాత్రకు బ్రేకులు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news