ఆ విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌ బికినీలు వేసుకుంటారాట..!

-

మాములుగానే ఎయిర్‌హోస్టెస్‌లు అంటే భలే అందంగా బొమ్మల్లా ఉంటారు కదా..! వాళ్లు ఏ అవుట్‌ఫిట్‌ వేసినా అదిరిపోతుంది. చాలామంది ఫ్లైట్‌ ఎక్కిన తర్వాత వాళ్లను అలానే చూస్తూ ఉండిపోతారు. కానీ మీరు ఎప్పుడైనా బికినీలో ఉండే ఎయిర్‌ హోస్టెస్‌ను చూశారా..? ప్రపంచంలోనే వెరైటీ విమానయాన సంస్థలు గురించి చూద్దాం.. ఒక్కోటి ఒక్కో వెరైటీ..!!
norwegian.com…ఈ కంపెనీ పేరు చూసి నార్వేలో ఉంటుందేమో అనుకునేరు..ఇది ఐరిష్ కంపెనీ. ఈ ఎయిర్‌లైన్ వ్యవస్థాపకుడు నార్వే పన్ను నుండి తప్పించుకోవాలనుకుని ఇలా చేశాడు. ఈ విమానయాన సంస్థ యొక్క అనేక విమానాలు నార్వేలో ల్యాండ్ అవవట.. ఇది ప్రయాణికులను చాలాసార్లు గందరగోళానికి గురిచేస్తుందట..
Eva Airline…పేరును బట్టి చూస్తే.. ఇది సాధారణ విమానయాన సంస్థలా ఉంది కదూ.. విమానం రూపకల్పన కూడా సాధారణమైనది, అయితే కంపెనీ తన విమానాలను హలో కిట్టి కార్టూన్‌కు అంకితం చేసి ఉంది. నివేదికల ప్రకారం, ఈ తైవాన్ విమానయాన సంస్థ జపనీస్ కార్టూన్ హలో కిట్టి తయారీదారుల నుండి లైసెన్స్ తీసుకున్న తర్వాత మొత్తం విమానాన్ని హలో కిట్టి డిజైన్‌పై చిత్రీకరించింది. చాలా విమానాలు హలో కిట్టి థీమ్‌తో చాలా అందంగా కనిపించాయి.
Eurowings airline..ఈ విమానయాన సంస్థ యొక్క ప్రత్యేకత బ్లైండ్ బుకింగ్. బ్లైండ్ బుకింగ్ ఆప్షన్‌తో టిక్కెట్‌లను బుక్ చేస్తున్నప్పుడు…టికెట్ ఏ ప్రదేశానికి బుక్ చేయబడిందో మీరు తెలుసుకోలేరు.. బుకింగ్ సమయంలో, మీరు ఎలాంటి గమ్యస్థానాన్ని సందర్శించుకోవాలనుకుంటున్నారు..అంటే.. పర్వతం, సముద్రం, అడవి వంటి ఏయే ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారో చెప్పాలి. దాని చెల్లింపు పూర్తయిన తర్వాత మాత్రమే, మీ టికెట్ ఎక్కడ బుక్ చేయబడిందో మీకు తెలుస్తుంది. భలే క్రేజీగా ఉంది కదూ..!
Bikini airline…బికినీ ఎయిర్‌లైన్ పేరుతో వియట్‌జెట్ విమానయాన సంస్థ 2011 సంవత్సరంలో వియత్నాంలో మొదటిసారిగా ప్రారంభించారు. చాలా కొద్ది కాలంలోనే ఇది చాలా ప్రజాదరణ పొందింది. కారణం ఈ ఎయిర్ లైన్స్‌లో పనిచేసే మహిళలు బికినీలు ధరించి కనిపించడమే. ఎయిర్ హోస్టెస్ యొక్క ఈ దుస్తుల కారణంగా ఈ విమానయాన సంస్థ కూడా చాలా వివాదంలో నిలిచింది.
Rayani airline…రయానీ ఎయిర్‌లైన్స్ 2015లో మలేషియాలో ప్రారంభమైంది. ఈ విమానయాన సంస్థ షరియత్ ప్రకారం నడుస్తుంది.. కాబట్టి దీనిని హిజాబ్ ఎయిర్‌లైన్ అని కూడా అంటారు.. అందుకే విమానంలో మద్యపానం నిషేధం, ప్రార్థనలు చేసిన తర్వాతే విమానం ఎగరడం, మరీ ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్‌లు హిజాబ్ ధరించి కనిపిస్తారు. ఈ విమానంలో హలాల్ మాంసాన్ని అందిస్తారు… 2016లో అంటే ప్రారంభమైన 1 సంవత్సరం తర్వాత ఈ విమానయాన సంస్థ నిషేధించారు…
Trump airline…అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ఎయిర్‌లైన్ అనే ఎయిర్‌లైన్ కంపెనీకి యజమాని. 1980వ దశకంలో, ఈస్టర్న్ ఎయిర్‌లైన్‌ను మూసివేయబోతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వేల కోట్ల రుణం తీసుకొని ఈస్టర్న్ ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేసి దానికి ట్రంప్ ఎయిర్‌లైన్ అని పేరు పెట్టారు. కొన్నేళ్ల తర్వాత ఇది కూడా నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news