ఆకట్టుకుంటున్న ఐశ్వర్య లుక్‌.. పొన్నియన్‌ సెల్వన్‌ నుంచి పోస్టర్‌ రిలీజ్‌

-

మణిరత్నం సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన పొన్నియన్‌ సెల్వన్‌ అనే చారిత్రక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలు ప్రముఖ నటులు నటిస్తుండడం విశేషం. అయితే.. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలువురు అగ్రతారలకు సంబంధించిన పోస్టర్‌లు రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. అయితే ఈ చిత్రంలో కీలకపాత్రలో అందాల తార ఐశ్వర రాయ్‌ కూడా నటిస్తుండగా.. ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్రయూనిట్‌ ఈ రోజు విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు నందిని అని వెల్లడించింది చిత్రయూనిట్‌.

అయితే సినిమాను సెప్టెంబర్‌ 30న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ బాషాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. అయితే ఇప్పుడు విడుదల చేసిన ఐశ్వర్యరాయ్‌ పోస్టర్‌ అందరనీ ఆకట్టుకుంటోంది. అయితే ఐశ్వర్య రీ ఎంట్రీ తరువాత చేస్తున్న భారీ సినిమా ఇది. అయితే ఈ సినిమా నుంచి హీరో కార్తీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవల విడుదల చేయగా మాంచి రెస్పాన్స్‌ వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version