టైం టూ వైల్డ్‌ రైడ్‌ అంటున్న ‘ఏజెంట్‌’ అఖిల్‌.. టీజర్‌ రచ్చ..

అక్కినేని యువ హీరో అఖిల్‌ నటిస్తున్న తాజా సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇవాళ విడుదల చేసిన టీజర్ లో కూడా మమ్ముట్టీ ఎంట్రీతోనే మొదలైంది. ఆ తర్వాత ‘ఏజెంట్’ గురించి అతను చెప్పే మాటలతో అఖిల్ ఎంట్రీ జరిగింది. విలన్లను ఆట ఆడుకోవడంలో అఖిల్ ఎలాంటి దిట్టో ఈ టీజర్ లో చూపించారు. శత్రు సైన్యాన్ని కట్టడి చేయడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే ‘ఏజెంట్’గా ఇందులో అఖిల్ నటిస్తున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది.

Mammootty, Akhil Akkinneni's 'Agent' teaser to be out soon | Entertainment  News | Onmanorama

అయితే.. హాలీవుడ్ స్థాయిలో ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హిప్ హాప్ తమిళ్ సంగీతం, రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం కూడా ఇందులో స్పష్టం కనిపిస్తోంది. ఇక హీరోయిన్ సాక్షి వైద్యలోనూ ఓ క్యూట్ డైలాగ్ చెప్పించి, ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదనిపించారు. తెలుగులో తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ స్పై థ్రిల్లర్ ను తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు మేకర్స్‌. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేయబోతున్న విషయాన్ని మాత్రం కన్ఫర్మ్‌ చేయలేదు చిత్రయూనిట్‌.