నాంపల్లిలో అట్టహాసంగా మొదలైన అలయ్ బలయ్

-

అలయ్ బలయ్ కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో భాగంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగేది. ఈసారి ఆయన కూతురు దీనిని ఆర్గనైజ్ చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

దీనికి బండారు దత్తాత్రేయ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హరిబాబు, విజయశంకర్, గుర్మిత్ సింగ్ కూడా హాజరయ్యారు. అతిథులకు తెలంగాణ సాంస్కృతిక బృందాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.కాగా, ప్రస్తుతం కొడంగల్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో హైదరాబాద్ చేరుకుని అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version