Breaking : హెచ్‌సీయూలో భారీగా పోలీసులు మోహరింపు

-

హైదరాబాద్‌లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘాలు గురువారం ఆందోళనలు నిర్వహించాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. ప్రధాని మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ మరోసారి ప్రదర్శించడంతో ఏబీవీపీ నిరసనకు దిగింది. హెచ్ సీయూలో వీడియో స్క్రీనింగ్ ను ఆపాలంటూ ఏబీవీపీ మెయిన్ గేట్ వద్ద బైటాయించింది. రెండు గ్రూప్ ల హోరాహోరీ నినాదాలతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు.

ప్రధాని మోడీపై ఇంటర్నేషనల్ మీడియా బీబీసీ తీసిన ఇండియా: ద మోడీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని ఇండియాలో ప్రదర్శించవద్దని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. అయితే కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version