హైదరాబాద్ ఆటో ప్రయాణికులకు అలర్ట్. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ మహా నగరంలో ఆటోలు బంద్ కానున్నాయి. ఆటో ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తు తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్ యూనియన్స్ జేఏసీ నేతలు రెండు రోజుల బంద్ కు పిలుపు నిచ్చారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. గత 8 ఏళ్ల నుంచి ఆటో ఛార్జీలను పెంచడం లేదని ఆటో డ్రైవర్స్ ఆందోళన చేపడుతున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆటోలకు, క్యాబ్ లకు డిమాండ్ బాగా తగ్గిందని అంటున్నారు.
ఆటో మీటర్ ఛార్జీలు కనీసం రూ. 40 ఉండాలని అలాగే ప్రతి కిలో మీటర్ కు రూ. 25 చోప్పున ఉంచాలని ఆటో డ్రైవర్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే సీఎన్జీతో నడిచే 20 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాగ ఆటో డ్రైవర్స్ సమ్మె వల్ల రెండు రోజుల పాటు ఆటోలు బంద్ కానున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రత్యమ్నాయ ఏర్పాటు చేసుకుని గమ్య స్థానాలకు చేరుకోండి.