ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ ఫేక్ మెసేజ్ మీకు వచ్చిందా..?

-

స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్ చేశారని మరో ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో సర్య్కూలేట్ అవుతోంది. దీని పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఫోన్‌కు వచ్చే నకిలీ ఎస్ఎంఎస్‌లు, ఈ-మెయిల్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని తెలిపింది. వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ వివరాలు షేర్ చేయొద్దని వెల్లడించింది. ఒక వేళ ఈ విషయంపై ఎలాంటి సందేహం ఉన్నా.. [email protected] కు నివేదిక సమర్పించాలన్నారు.

ఎస్‌బీఐ
ఎస్‌బీఐ

ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఈ హెచ్చరికను షేర్ చేసింది. కాగా, ఎస్‌బీఐ బ్యాంకింగ్‌కు సంబంధించి ఫేక్ మెసేజ్‌లు వ్యాప్తి చెందటం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చి నెలలో చాలా మంది ఎస్‌బీఐ వినియోగదారులకు కేవైసీ నిబంధనలను పాటించకపోతే తమ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎస్ఎంఎస్‌లు వచ్చాయి. కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని ఓ లింక్ షేర్ కూడా చేశారు కేటుగాళ్లు. ఈ మేరకు ఖాతాదారులు ఎవరూ నకిలీ సందేశాలతో వచ్చే లింక్స్ లను క్లిక్ చేయొద్దని ఎస్‌బీఐ కోరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news