కస్టమర్లకు అలర్ట్ న్యూస్..వరుసగా ఆ ఐదు రోజులు బ్యాంకులు పనిచెయ్యవు..!!

-

ప్రతి నెల ఏదొక పండుగలు రావడం కామన్..ప్రభుత్వ సెలవులు కావడంతో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.అలాగే ఈ ఆగస్టు నెల లో కూడా ఎక్కువ సెలవులు ఉన్నాయి.. ఈసారి ఏకంగా 19 రోజులు సెలవులు వచ్చాయి. ఈ వారం ఏకంగా వరుసగా ఐదు రోజులు సెలవులు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.. రోజుల్లో బ్యాంక్, ఏటీఎం లు పనిచెయ్యవని తెలుస్తుంది.. అయితే ఆ రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ చెయ్యడం ఉత్తమం అధికారులు అంటున్నారు…

వారాంతపు సెలవులతో పాటు పండుగుల కూడా ఒకేసారి రావడంతో బ్యాంకులకు ఈ వారం వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఇవి కూడా దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి. మరి ఆ లిస్టు ఏంటో చూసేద్దామా..ఆగష్టు నెలలో మొత్తంగా 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి.

ఇందులో 5 వారాంతపు సెలవులు ఉండగా.. మిగిలిన 13 పండుగ సెలవులు వచ్చాయి. అయితే ఈ సెలవులు కూడా ప్రాంతాల వారీగా మారుతున్నాయి. అయితే ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ క్లోజ్ కానున్నాయి.

ఈ వారంలో ఉన్న వరుస ఐదు రోజుల సెలవులు ఏంటో చుద్దాము..

ఆగష్టు 11 – రక్షాబంధన్( అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, జైపూర్, షిమ్లా)

ఆగష్టు 12 – రక్షాబంధన్( కాన్పూర్, లక్నో)
ఆగష్టు 13 – రెండవ శనివారం
ఆగష్టు 14 – ఆదివారం
ఆగష్టు 15 – ఇండిపెండెన్స్ డే
ఇవి కాక మరికొన్ని రోజులు సెలవులు ఉన్నాయి..ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఎక్కువగా ఉన్నందున బ్యాంక్ పనులను వెంటనే పూర్తి చేసుకోవడం మేలని అధికారులు హెచ్చరిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news