దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి : ఈటల రాజేందర్‌

పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. సోమవారం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రోషం ఉన్న బిడ్డ కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. మీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని కోరాలని, బై ఎలక్షన్ రావాలంటే దమ్ముఉండాలన్నారు ఈటల రాజేందర్‌. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన 5 నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదించారని, 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు, ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా టీఆర్‌ఎస్‌లో చేరారని మండిపడ్డారు ఈటల రాజేందర్‌. కొంతమంది మంత్రి పదవులు కూడా ఎలగబెడుతున్నారంటూ విమర్శించారు ఈటల రాజేందర్‌.

People vexed with TRS government: Eatala Rajender

నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే బైక్ ర్యాలీలు చేపడుతున్నట్లు ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజీనామా చేయకుండా ఉన్నారని, 12 మంది పార్టీ మారినప్పుడు రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు ఈటల రాజేందర్‌. కాంగ్రెస్ లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేశారని వెల్లడించారు ఈటల రాజేందర్‌. కాంగ్రెస్ లో గెలిచి కొందరు మంత్రిగా వెలగబెడుతున్నారని, రాజగోపాల్ రాజీనామాతో 10 లక్షల మందికి పెన్షన్ ప్రకటించారన్నారు ఈటల రాజేందర్‌.