ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్…!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సబ్‌స్క్రైబరా మీరు కూడా..? మీ పీఎఫ్ అకౌంట్నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా…? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఒక వరం ఇచ్చారు. ఇక మరి దాని గురించి చూస్తే.. ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ డిడక్టెట్ ఎట్ సోర్స్‌ను (TDS) 10 శాతం తగ్గించడం జరిగింది. అలానే నాన్-పాన్ కేసుల్లో విత్‌డ్రాయల్స్‌పై 30 శాతం టీడీఎస్ అయితే ఉండేది. 20 శాతానికి దీన్ని తగ్గించేశారు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పోర్టల్‌లో పాన్ కార్డ్ అప్‌డేట్ ని చేయకపోతే టీడీఎస్ వర్తిస్తుంది. అయితే ఈ అకౌంట్ నుండి పలు కారణాలతో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. కరోనా వలన ఆర్థికంగా దెబ్బతిన్నవారు ఆ కారణంతో డబ్బులు తీసుకోవచ్చు. లేదంటే వైద్య ఖర్చులు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు వంటి వాటి కోసం అయినా కూడా డబ్బులని తీసుకోవచ్చు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాక ముందు ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే 10 శాతం టీడీఎస్ ని కట్టాల్సి వుంది.

సో ముందు మీ పాన్ నెంబర్ ఇవ్వాలి. లేదు అంటే కొత్త నిబంధనల ప్రకారం 20 శాతం టీడీఎస్ చెల్లించాలి. ఐదు ఏళ్ళు సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 లోపు విత్‌ డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ రూ.50,000 మించితేనే టీడీఎస్ వర్తిస్తుంది గుర్తు పెట్టుకోండి. పాన్ కార్డ్ లేదా ఫామ్ 15జీ లేదా 15హెచ్ సబ్మిట్ చేస్తే టీడీఎస్ కట్టక్కర్లేదు. ఐదు ఏళ్ల సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 మించి డ్రా చేస్తే పాన్ కార్డ్ వివరాలు లేనప్పుడు టీడీఎస్ వర్తిస్తుంది. సర్వీస్ ఐదేళ్లు పూర్తైన వారు పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version