SBI కస్టమర్లకు అలెర్ట్..ఉగాదికి షాక్ ఇచ్చిన బ్యాంకు..

-

దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఎస్బిఐ ఎప్పుడు కస్టమర్లకు అదిరిపోయే న్యూసులు చెప్తుంది.. తాజాగా కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది..ఉగాది పండుగ ముందు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది..స్టేట్ బ్యాంక్ తాజాగా రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. లోన్స్‌పై బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు పెంచినట్లు వెల్లడించింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం మార్చి 15 నుంచి అమలులోకి వస్తుందని చెప్పుకోవచ్చు..

 

ఎస్‌బీఐ బేస్ రేటును గమనిస్తే.. తాజా రేటు పెంపు తర్వాత ఇప్పుడు 10.10 శాతానికి చేరింది. ఇది వరకు ఈ రేటు 9.4 శాతంగా ఉండేది. అంటే బేస్ రేటు భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. 70 బేసిస్ పాయింట్లు పైపైకి చేరింది..విషయానికొస్తే..తాజా రేటు పెంపు తర్వాత ఇప్పుడు 10.10 శాతానికి చేరింది. ఇది వరకు ఈ రేటు 9.4 శాతంగా ఉండేది. అంటే బేస్ రేటు భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. 70 బేసిస్ పాయింట్లు పైపైకి చేరింది..

అదే విధంగా ఎస్‌బీఐ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును గమనిస్తే.. ఇది కూడా ఎక్కువగానే పెరిగింది. ఇది వరకు ఈ రేటు 14.15 శాతంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇది 14.85 శాతానికి ఎగసింది. రేపటి నుంచి ఈ రేట్ల పెంపు అమలులోకి వస్తుంది..అయితే ఎస్‌బీఐ మాత్రం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును స్థిరంగానే కొనసాగింది. ఎంసీఎల్ఆర్ రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.9 శాతం వద్దనే ఉంది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.1 శాతం వద్ద ఉంది..

ఇక ఎంసీఎల్ఆర్ విషయానికి వస్తే.. ఇది 8.1 శాతంగానే ఉంది. అదే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ అయితే 8.4 శాతంగా ఉంది. ఇంకా ఏడాది ఎంసీఎల్ఆర్ 8.5 శాతంగా ఉంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.6 శాతంగా, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.7 శాతంగా ఉన్నాయి.. ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు విషయానికి వస్తే.. ఇది కూడా స్థిరంగానే ఉంది. ఇది 9.15 + సీఆర్‌పీ + బీఎస్‌పీగా ఉంది. ఇక ఆర్ఎల్ఎల్ఆర్ అయితే 8.75 శాతం + సీఆర్‌పీగా ఉంది..

బీపీఎల్ఆర్ అనేది ఇంటర్నల్ బెంచ్‌మార్క్ రేటు. బ్యాంకులు ఈ రేటు ప్రాతిపదికన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే బీపీఎల్ఆర్ పెరిగితే అందుకు అనుగుణంగా హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు కూడా పైకి చేరొచ్చు. బీపీఎల్ఆర్ విధానంలో పారదర్శకత లేకపోవడంతో ఆర్‌బీఐ 2010లో బీపీఎల్ఆర్ ప్లేసులో బేస్ రేటు సిస్టమ్‌ను తెచ్చింది..ఇకపోతే బేస్ రేటు అంటే కనీస రుణ రేటు. అంటే బ్యాంకులు ఈ రేటు కన్నా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వవు. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు బేస్ రేటును త్రైమాసికానికి కనీసం ఒక్కసారి అయిన చెక్ చేయించుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news