నేటితో భారత షట్లర్ల పోరాటం స్విస్ ఓపెన్‌లో 300 బ్యాడ్మింటన్ టైటిల్ సింగిల్స్‌లో ముగింపుకి వచ్చింది. పీవీ సింధు, కిదాంబీ శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ ఎలిమినేట్ అయ్యారు. డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టీ మాత్రం సత్తా చాటుతూ దూసుకెళ్తున్నారు. వరుసగా విజయాలు అందుకుంటూ, క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చేసారు . తైవాన్‌కు చెందిన ఫాంగ్ చిహ్ లీ – ఫాంగ్ జెన్ లీ జంటపై 12-21 21-17 28-26తో సాత్విక్ – చిరాగ్ గెలిచి తమ సత్తా చాటారు. వీరు సెమి ఫైనల్స్ వెళ్ళడానికి జెప్పే బే – లస్సే మొల్మెడే (డెన్మార్క్) జోడీతో తలపడనున్నారు.
గత ఏడాది మహిళల సింగిల్స్ ఛాంపియన్ గా నిలిచిన పీవీ సింధు ఈసారి తొందరగానే ఇంటి దారి పట్టింది. ఈసారీ రెండో రౌండ్‌లోనే ఎలిమినేట్ అయ్యింది సింధు. ఇండేనేషియా అన్‌సీడెడ్ ప్లేయర్ పుత్రి కుసుమ వర్దానీ వరల్డ్ నంబర్ 9 సింధు పై విజయం సాధించింది. 38వ ర్యాంకర్ అయిన వర్దానీ 15-21 21-12 18-21తో సింధుపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ ను రెండో రౌండ్‌లో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) ఓడించాడు. కిదాంబి శ్రీకాంత్ కూడా హాంకాంగ్‌కు చెందిన చుయెక్ యూ లీ 22-20 21-17తో తలపడి ఓటమి పాలయ్యాడు.