బీజేపీతో పొత్తు వల్ల జనసేన పార్టీకి తీవ్ర నష్టమే మిగులుతుందని జనసేన గోదావరి జిల్లాల ఇంచార్జీ బొల్లిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ చేసే పనుల వల్ల జనసేన పార్టీకి భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన పేర్కొన్నారు. కాగా, ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌ను సీఎం క్యాండిడెట్‌గా ప్రకటించకపోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. బీజేపీ వల్ల జనసేన పార్టీకి చెందిన మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ నేతలు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు శనివారం జనసేన గోదావరి జిల్లాల ఇంచార్జీ బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీపై విమర్శలు చేశారు. సీఎం అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించకపోవడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బీజేపీ పట్టించుకోలేదని బొలిశెట్టి ఆరోపించారు. అటువంటి బీజేపీతో తాము పొత్తు పెట్టుకునేదే లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం జనసేన నేతలపై అక్రమ కేసులు పెడుతున్నా.. బీజేపీ పట్టించుకోలేదన్నారు. బీజేపీ వల్ల జనసేన తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు.