పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నల వర్షం.. వీటికి సమాధానం చెప్పాలంటూ..?!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బస్సు యాత్రను ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తోంది ప్రజల కోసమా? లేదా చంద్రబాబు కోసమా? అని నిలదీశారు. దీనిపై పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాలని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఆపద రాకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు కాపాడుతున్నాడో అర్థం కావట్లేదన్నారు. మంత్రి ఆర్‌కే రోజా శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

మంత్రి ఆర్‌కే రోజా
మంత్రి ఆర్‌కే రోజా

నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన గన్‌మెన్, డ్రైవర్ ఆలయ మహాద్వారం నుంచి వచ్చారని కొన్ని వార్తా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రమే మహాద్వారం నుంచి వచ్చినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు హయంలో ఎన్నో ఆలయాలు కూలిపోయాయి. అప్పుడు ఈ ఛానల్స్ ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. పదో తరగతి పరీక్ష ఫలితాలపై టీడీపీ వ్యవహారం సరైనది కాదన్నారు.