ఈ రైలు ఎక్కితే..టికెట్‌ అవసరం లేదు..! ఏళ్ల నుంచి ఇదే తంతు.!

-

ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా..టికెట్‌ తీసుకోవాలి.. టికెట్‌ లేని ప్రయాణం నేరం అంటారు. పొరపాటున టికెట్‌ లేకుండా ట్రెయిన్‌ ఎక్కితే..టీసీకి దొరికితే.. ఫైన్‌ కట్టాల్సిందే కదా.. కానీ ఆ ట్రెయిన్‌ ఎక్కలంటే.. టికెట్‌ అక్కర్లేదట. ఈ ఆఫర్‌ ఇప్పటిది కాదు.. 73 ఏళ్లుగా మొత్తం 25 గ్రామాల ప్రజలు ఈ ట్రైన్‌లో ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. ఇంతకీ ఏంటా ట్రైయిన్‌, ఎందుకు ఆ ఆఫర్‌ ఇచ్చారో చూద్దామా..!

నాగల్ నుంచి భాక్రా డ్యామ్ మధ్య ఈ రైలు నడుస్తుంది. భాక్రా నంగల్‌ డ్యామ్‌ గురించి ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ రైలును నడపుతున్నారట.. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ డ్యామ్ కట్టడానికి ప్రజలు పడిన కష్టం అందరికి తెలియజేయాలనేనట. దీనిని భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ నిర్వహిస్తుంది. ఈ రైల్వే ట్రాక్ పర్వతాలను బద్దలు కొట్టి మరీ తయారు చేశారు. ఈ రైలు 1949లో ప్రారంభమైంది. గత 73 సంవత్సరాలుగా ప్రజలు ఇందులో ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. ఈ రైలులో రోజుకు 25 గ్రామాల నుంచి దాదాపు 300 మంది ప్రయాణిస్తున్నారట..

అయితే.. ఈ రైలు వల్ల విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. రైలు నంగల్ నుంచి డ్యామ్ వరకు నడుస్తుంది. రోజుకు రెండుసార్లు ప్రయాణిస్తుంది. ఇందులో టీటీఈ ఉండరు. డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ రైలుకు రోజుకు 50 లీటర్ల డీజిల్‌ అవసరం అవుతుంది. ఈ రైలు ఇంజిన్‌ను స్టార్ట్ చేసిన తర్వాత భాక్రా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే ఆగిపోతుంది. ఈ రైలు నంగల్ నుంచి ఉదయం 7:05 గంటలకు బయలుదేరి ఉదయం 8:20 గంటలకు భాక్రా నంగల్‌కు తిరిగి వస్తుంది. తర్వాత మరోసారి మధ్యాహ్నం 3:05 గంటలకు నంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు భాక్రా డ్యాంకు చేరుకుంటుంది. ఇలా ఏళ్ల తరబడి ఇదే పద్దతిని పాటిస్తూ.. రైలును ఉచితింగా ప్రయాణిస్తున్నారు. నిజంగా ఇది గొప్ప విషయమే..!

Read more RELATED
Recommended to you

Latest news