అల్లు అర్జున్ @ 20 యేళ్లు.. సినీ ప్రస్థానం ఎలా జరిగిందంటే..?

-

ఈరోజుతో అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విధంగా ట్వీట్ చేసుకువచ్చాడు. ఈరోజుతో నటుడిగా నేను చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పుడూ నా వెంటే ఉన్నాయి. ఇండస్ట్రీలో నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రేక్షకుల ప్రేమకు రుణపడి ఉంటాను. ఎప్పటికీ నేను మీకు కృతజ్ఞుడిని అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.

దీంతో అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. 2003లో కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగోత్రి సినిమా తో సినీ రంగ ప్రవేశం చేశారు అల్లు అర్జున్.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు నటుడిగా కూడా ప్రశంసలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు రామలింగయ్య మనవడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.

ఇక తర్వాత ఆర్య , బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఆయన ఐకాన్ స్టార్ కాస్త ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు.. మొత్తానికి అయితే అల్లు అర్జున్ తన స్టార్ స్టేటస్ ని నిరూపించుకున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version