అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్ రూ.100 కోట్లా.. ద్యేవుడా..!

-

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. ఎవరికీ అందనంత ఎత్తులోకి వెళ్లాడు బన్నీ. పుష్ప సాంగ్స్‌, డైలాగ్స్‌ తో బాలీవుడ్‌ సెలబ్రీటీలు, క్రికెటర్లు తమ తమ సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తుండటమే ఇందుకు బెస్ట్‌ ఎక్సంపుల్‌. బన్నీ నటనకు కూడా ఫిదా అయ్యామంటూ కామెంటస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. తన తర్వాతి సినిమాలపై ప్రత్యేక శ్రద్ధా తీసుకుంటున్నాడు బన్నీ. పుష్ప 2 తర్వాత తన చేయబోయే సినిమాల లైనప్‌ ను క్రేజీగా రెడీ చేసుకుంటున్నాడు బన్నీ.

ఇందులో భాగాంగానే తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ, బన్నీ భేటీ అయ్యారు. అయితే.. వీరిద్దరూ కలిసింది సినిమా కోసమేనని తెలుస్తుంది. అన్ని కుదిరితే.. తర్వలోనే ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్‌ నడుస్తోంది. ఈ సినిమా కు అనిరుధ్‌ సంగీతమందిస్తాడని.. లైకా ప్రోడక్షన్స్‌ భారీ వ్యయంతో.. నిర్మిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇక బన్నీకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్‌ కూడా ఇచ్చేందుకు చిత్ర బృందం ఇచ్చేందుకు రెడీ అయిందట. దీనిపై తర్వలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news