Pushpa Movie: రామోజీ ఫిల్మ్‌సిటీలో దుమ్మురేపుతున్న”పుష్ప‌”..

-

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ ల‌ కాంబోలో రూపొందుతున్న సినిమా పుష్ప.. గతంలో వీరిద్ద‌రి క్రేజీ కాంబీనేష‌న్లో వ‌చ్చిన ఆర్య సిరీస్ ఎలాంటి హిట్ సాధించిందో అంద‌రికి తెలిసిందే.. మ‌రోసారి ఈ క్రేజీ కాంబినేష‌న్లో మ‌రో మూవీ రాబోతుండడంతో పుష్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.బ‌న్నీ కెరీర్ లో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ మూవీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రెండు భాగాలు తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్. స‌క్సెస్ పుల్ మూవీ మేక‌ర్స్ కి కేరాఫ్ గా ఉండే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన‌.. టీజ‌ర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ భారీ స్థాయిలో వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా.. ‘పుష్ప’ సినిమా చకచకా ఘాటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్‌లో సందడి చేయడానికి శరవేగంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగును పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌, రావు రమేష్‌ తదితరులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్ష‌న్ సీన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news