సాధారణంగా ఒక్కొక్క హీరో లేదా ఒక్కొక్క హీరోయిన్ లేదా సామాన్య వ్యక్తులు అయినా సరే తమకు నచ్చిన విధంగా తమకు నచ్చిన వస్తువును ఎంత డబ్బు పెట్టి అయినా సరే కొనుగోలు చేయడానికి వెనుకాడరు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇది చాలా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది . ఏదైనా ఒక వస్తువుపై వారు మనసు పడ్డారు అంటే అది ఎన్ని కోట్లు అయినా సరే వెంటనే వెచ్చించి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా అత్యంత విలువైన వస్తువులను తన సొంతం చేసుకున్నారు. వాటి విలువ అక్షరాల కొన్ని వందల కోట్లు ఉంటుందని సమాచారం మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.హబ్లాట్ బిగ్ బ్యాంగ్ స్టీల్ కార్బన్ వాచ్..
అల్లు అర్జున్ ఓ సందర్బంలో హబ్లాట్ బిగ్ బ్యాంగ్ స్టీల్ కార్బన్ చేతి గడియారంతో కనిపించాడు. దీని విలువ రూ.10.25 లక్షలు
బ్రెయిట్లింగ్ నావిటిమర్ వాచ్..
దీని విలువ రూ.15 లక్షలు దాకా ఉంటుంది. క్రోనోగ్రాఫ్ అనే స్టైలిష్ వాచ్ కూడా ఉంది.
కార్టియర్ శాంటాస్ 100XL..
ఐకాన్ స్టార్ ధరించే ఈ వాచ్ ఖరీదు రూ. 4.44 లక్షలు ఉంటుంది.
ఇక తన ఫ్యాన్సీ నెంబర్ 0666:
బన్నీకి ఈ నెంబర్ అంటే చాలా ఫేవరెట్ . అలాగే సెంటిమెంట్ కూడా ఈ నెంబర్ కోసం బన్నీ కోట్లల్లో ఖర్చు చేస్తాడు.
బ్రెయిట్లింగ్ అవెంజర్ హరికేన్ 45.
బన్నీ దగ్గర బ్రెయిట్లింగ్ బ్రాండ్ లో మరో మోడల్ కూడా ఉంది. దీని విలువ రూ. 4.51 లక్షలు.
వీటితోపాటు.. రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఓగ్, రూ.3.29 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ కార్, రూ.7 కోట్ల విలువైన ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్ , అలాగే జూబ్లీహిల్స్ లో రూ.80 కోట్ల విలువైన బ్లెస్సింగ్ పేరుతో లావిస్ హౌస్, కోకాపేటలో రూ.50 కోట్ల విలువ చేసే ఖరీదైన భూమి కూడా ఆయన సొంతం. వీటితోపాటు మరెన్నో ఖరీదైన వస్తువులను కూడా ఆయన సొంతం చేసుకున్నారట.