జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోదు. ఎప్పుడోకప్పుడు గట్టి దెబ్బ తగులుతూనే ఉంటాయి. ఈమె జీవితంలో కూడా అనుకోని సంఘటన ఎదురైంది. దాంతో జీవితమే మారిపోయింది. సౌమ్యత బసు కలకత్తా ప్రాంతానికి చెందిన వారు. భరతనాట్యం నేర్చుకుని ఎన్నో ప్రోగ్రాములు చేశారు. ఆమె 32 ఏళ్ల వయసులో సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చింది. దీంతో ఆమె కాళ్ళు కదప లేకపోయారు.
ఈమె ఆరోగ్య పరిస్థితి బాగోక పోవడం వల్ల మంచానికే పరిమితం అయ్యారు. అన్నింటికి దూరమయ్యి రెండేళ్ల పాటు మంచం మీద ఉన్నారు. ఇతరులు సహాయం లేకపోతే ఏ పని జరిగేది కాదు. అనుకోని సంఘటన ఎదురవడంతో ఆమె విశ్వాసాన్ని కూడా కోల్పోయారు. కానీ చాలా మంది పుట్టుకతోనే ఎన్నో ఇబ్బందులు తో బాధపడతారు.
ఇంకా నా పరిస్థితి అయితే నయమే అని ఆమె అనుకున్నారు. అయితే ఆమె బట్టలు వేసుకోవడమే కష్టం కావడంతో ఆమెకు ఒక వినూత్న ఆలోచన వచ్చింది. అలాంటి వాళ్ళు వేసుకునేందుకు సౌకర్యంగా ఉండే దుస్తులను తయారు చేసే కంపెనీని మొదలు మొదలు పెట్టారు. ఇలా ఆమె ఈ వ్యాపారం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఇలా బట్టలు డిజైన్ చేయడం వల్ల అటువంటి వాళ్ళకి సాయం చేయడమే కాకుండా ఆదాయం కూడా వస్తుందని ఈ ఐడియాని ఆమె ఫాలో అయ్యారు.
ఇప్పుడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ఆర్థరైటిస్, పార్కిన్సన్, దీర్ఘకాలిక సమస్యలు, ఆటిజం, క్యాన్సర్ తో బాధ పడే వాళ్లకి ఈ దుస్తులు బాగా హెల్ప్ అవుతాయి. వృద్ధులకు కూడా ఈ బట్టలు హెల్ప్ అవుతాయి. స్త్రీ పురుషులకి పిల్లలకి కూడా జైనికా బ్రాండ్ దుస్తులు తయారుచేస్తుంది.