సౌర విద్యుత్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తాం : ముకేశ్ అంబానీ

-

ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ‘ఇన్వెస్టర్ సమ్మిట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రం ముందుంది. ఇక్కడ జియో నెట్వర్క్ బాగా వృద్ధి చెందింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ప్రభుత్వం నుంచి మంచి సహకారం లభిస్తోంది. ఇక్కడ మా పెట్టుబడులు కొనసాగుతాయి. ముఖ్యంగా సౌర విద్యుత్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తాం’ అని పేర్కొన్నారు. అలాగే
ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సబ్మిట్ లో మాట్లాడిన సీఎం, ‘దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు అన్నీ ముందుకు వస్తున్నాయి. 340 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటి విలువ రూ. 13 లక్షల కోట్లు. తొలి రోజు 92 MOU లు కుదిరాయి. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది’ అని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version