చంద్రబాబు కోసమే.. పవన్ కళ్యాణ్ పుట్టాడు – అంబటి

-

పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడని మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ .. వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చెప్పడం… పోలవరాన్ని నాశనం చేసినట్లే చేస్తారని ఆగ్రహించారు.

మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఏమీ ఒరగడు..పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ గత ప్రభుత్వం భాధ్యత వహించాలన్నారు. టిడిపి తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలువచ్చాయి..డయాఫ్రమ్ వాల్ నిర్మానంలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు.

ఇప్పుడు దాని అంచనా వ్యయం పెరిగింది..2017-18 నాటి అంచనాలే 50 వేలకు దాటి ఉన్నాయి..పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం పుట్టాడు, పనిచేస్తున్నాడు.. పనిచేస్తాడని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలోని మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో నోటు కి ఓటు లాంటిది జరిగింది..నిరూపించ లేక పోవచ్చు కానీ టిడిపి కొనుగోలు చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version