పవన్ కళ్యాణ్ మీటింగ్.. పిట్టల దొర వ్యవహారం – అంబటి రాంబాబు

-

పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మీటింగ్.. పిట్టల దొర వ్యవహారంగా ఉందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చూస్తే బీజేపీతో గొడవ పడినట్లు ఉన్నాయని.. టీడీపీకి వచ్చేస్తున్నా అని సంకేతాలు ఇవ్వటానికే మీటింగ్‌ అనే డ్రామా అని ఫైర్‌ అయ్యారు.


ఇది ‘‘బాబూ వచ్చేస్తున్నా’’ మీటింగ్‌ అని.. కౌలు రైతుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ, అభిమానం ఉన్నాయని చెప్పారు. అందుకే రైతులకే కాకుండా, కౌలు రైతులకు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా ఇస్తున్నామని.. ఏటా రూ.13,500 చొప్పున అయిదేళ్లలో రూ.67,500 ఇస్తున్నామని.. భీమవరం, గాజువాకలో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారని పవన్‌ కల్యాణ్‌ కు చురకలు అంటించారు.

2024లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవదని శాపనార్థాలు పెట్టాడని… 2019కి ముందు జగన్‌ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తాన్నాడని… పవన్ కళ్యాణ్ పై ఫైర్‌ అయ్యారు. రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావని అర్ధం అయినట్టు ఉందని.. నిస్సిగ్గుగా వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పల్టీ నాయకుడని.. ఎవరి పల్లకీ మోయను అంటూనే చంద్రబాబు పల్లకీ తప్ప అన్న కండిషన్‌ పెట్టుకున్నట్టుగా… అదే తన పరమార్థం అన్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ వ్యతిరేక ఓటును చీల్చాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version