దాడి ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే సమాధానం చెప్పాలి : అంబటి రాంబాబు

-

ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వడంతోపాటు.. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో, విశాఖలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓ వైపు రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. విశాఖ గర్జన సభ అనంతరం.. మంత్రులు తిరుగుపయనమయ్యారు. ఇదే సమయంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకుంటుండటంతో… జనసైనికులు విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నారు.

AP: Pawan indulging in cheap politics, says YSRCP MLA Ambati Rambabu

 

ఈ క్రమంలో మంత్రులు తిరిగి వెళుతుండగా.. అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. జోగిరమేష్‌, రోజా, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేసి.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన కార్యకర్తల దాడిలో మంత్రి జోగి రమేష్‌ కారు అద్దాలు ధ్వంసం కాగా.. మంత్రి రోజా సహాయకుడికి, పలువురికి గాయాలయ్యాయి. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ లపై విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జనసైనికులు దాడి చేశారంటూ ట్వీట్ చేశారు. ఈ దాడి ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే సమాధానం చెప్పాలని నిలదీశారు. కాగా, దాడి ఘటనలో మంత్రి రోజా సహాయకుడికి కూడా గాయాలైనట్టు వైసీపీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా పంచుకుంది. మంత్రి జోగి రమేశ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news