తెలంగాణ రాక ముందు కరెంట్ కోతలు, ఛార్జీల మోతలు : కేటీఆర్‌

-

తుర్కయాంజల్ మున్సిపాలిటిలోని మన్నెగూడలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని అన్నారు. అన్నదాతల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాక ముందు కరెంట్ కోతలు, ఛార్జీల మోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం పండుగలా మారిందన్నారు మంత్రి కేటీఆర్. గతంలో రైతుల ఆత్మహత్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువగా జరిగేవన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోనే వరి ధాన్యం పండించడంలో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్.

 

Telangana Minister KTR Makes 'Parivarvad' Jibe At Amit Shah

తెలంగాణలో కరెంట్ కోతలు లేవని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్. 2014లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు ఉంటే..ఇప్పుడు మూడున్నర కోట్ల టన్నుల వరకు ధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు మంత్రి కేటీఆర్. రైతులకు పెట్టుబడి కింద రైతు బంధు అందిస్తున్నామన్నారు. ఈ పథకం కింద 58వేల కోట్ల రూపాయలను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడికే 18వేల కోట్ల కాంట్రాక్టును కేంద్రం ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. అదే డబ్బును నల్లగొండ జిల్లా అభివృద్దికి కేటాయిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పినా బీజేపీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news