ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల అంశంపై జరుగుతున్న వివాదంలో మాజీ క్రికెటర్, త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్న అంబటి రాయుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్ లాంటిదన్నారు. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోందని ప్రశంసించారు. ప్రతి మనిషికి ఏది అందాలో అది వాలంటరీ ద్వారా అందుతుందని చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన అని.. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని ప్రకటించారు. గుంటూరులో ఆయన వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
వాలంటీర్ల వ్యవస్థ అనేదే గొప్ప ఆలోచన అని, ప్రతి మనిషికి ఏ సేవలు అవసరమో అవన్నీ వలంటీర్ల ద్వారా పక్కాగా అందుతున్నాయని చెప్పుకొచ్చారు. కరోనా లాంటి విపత్కర సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేమని చెప్పుకొచ్చారు. దేశంలో మరెక్కడా ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ లేదని, అలాంటిది మన రాష్ట్రంలో ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు.