ఏపీలో షా-నడ్డా..బాబు-పవన్‌కు క్లారిటీ వచ్చేస్తుందా?

-

బి‌జే‌పి పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రెండు రాష్ట్రాల్లో భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒకరోజు గ్యాప్‌తో బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు జే‌పి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. కేవలం పార్టీ పరమైన కార్యక్రమాల్లోనే వారు పాల్గొనున్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృధ్దిని ప్రజలకు వివరించనున్నారు. శనివారం నడ్డా సభ శ్రీకాళహస్తిలో ఉండగా, ఆదివారంలో విశాఖలో షా సభ ఉంది.

ఇలా ఏపీలో బి‌జే‌పి పెద్దలు పర్యటించనున్నారు. అయితే ఏపీలో పర్యటిస్తున్న నేతలు..పొత్తులపై క్లారిటీ ఇస్తారా? జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? లేదా వైసీపీ తో పాటు టి‌డి‌పిని కలిపి విమర్శిస్తారా? అసలు వారి వైఖరి ఎలా ఉంటుందనేది పెద్ద చర్చగా మారింది.  టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో తిరిగి బీజేపీతో పొత్తు అంశం పైన అనేక రకాల ప్రచారం సాగుతోంది. బీజేపీ ఇప్పుడు పవన్ ప్రతిపాదించినట్లుగా టీడీపీ, జనసేనతో కలిసి పొత్తుకు సిద్దం అవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ నిర్ణయం కోసం చంద్రబాబు,  పవన్ వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబుతో ప్రతిపాదనలే మినహా పొత్తులపైన నిర్ణయం జరగలేదని తెలుస్తోంది.

అయితే ఇక్కడ పొత్తుల అంశం ప్రస్తావించరని బి‌జే‌పి నేతలు అంటున్నారు. అదే సమయంలో ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి..బి‌జే‌పి నేతలు కేవలం మోదీ విజయాలని చెప్పుకుంటే పొత్తులపై వారు ఏదో ఆలోచనలో ఉన్నారని అర్ధం చేసుకోవచ్చ్. అలా కాకుండా వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తే..టి‌డి‌పికి లైన్ క్లియర్ అయినట్లు..ఇక వైసీపీతో పాటు టి‌డి‌పిని విమర్శిస్తే..రెండు పార్టీలకు సమ దూరంలో ఉన్నట్లు అదే సమయంలో వైసీపీకి పరోక్షంగా సాకారం అందిస్తున్నట్లే. చూడాలి మరి బి‌జే‌పి పెద్దల రాజకీయం ఎలా ఉంటుందో. ఇక వారే బట్టే బాబు-పవన్ పొత్తుల అంశం తేల్చుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version