బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది : అమిత్‌ షా

-

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం చాలా పెద్దదని.. వాళ్లు అధికారంలో ఉన్నందునే రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మునుగోడు బీజేపీ సభలో అభిప్రాయపడ్డారు అమిత్‌ షా. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు అమిత్‌ షా.

EC gives clean chit to BJP chief Amit Shah over Nagpur, Nadia speeches- The  New Indian Express

పెట్రోల్ ధరలు మోడీ సర్కారు రెండుసార్లు తగ్గించినా.. కేసీఆర్ సర్కారు తగ్గించలేదని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని అమిత్‌ షా చెప్పారు. మోడీ సర్కారు రూ.2 లక్షల కోట్ల సాయం అందించినా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోనే ఎందుకుందని అమిత్ షా ప్రశ్నించారు. 8 ఏండ్ల పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి తప్ప యువతకు ఉపాధి దక్కలేదని వాపోయారు అమిత్‌ షా. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు అమిత్‌ షా. తెలంగాణలో కమలం వికసించేలా చేయాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పారు అమిత్‌ షా.

 

 

Read more RELATED
Recommended to you

Latest news