రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్ అవినీతి సర్కారు మాయమైపోతుంది : అమిత్‌ షా

-

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారును కూకటివేళ్లతో పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్ అవినీతి సర్కారు మాయమైపోతదని చెప్పారు అమిత్‌ షా. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్‌ షా.. సర్థార్ వల్లభాయ్ పటేల్ చొరవతో రజాకార్ల కబంధ హస్తల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని అన్నారు. తాము గెలిస్తే సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అమిత్ షా మండిపడ్డారు.

Amit Shah launches Bihar campaign with virtual rally, says 'issues left  untouched for 70 years resolved by Modi govt' | Highlights | The Financial  Express

మజ్లిస్  పార్టీకి భయపడే కేసీఆర్ ఆ హామీ అమలు చేయలేదని అమిత్‌ షా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ వ్యక్తి సీఎం కాబోతున్నారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని అమిత్‌ షా వెల్లడించారు. కేసీఆర్ అండ్ కంపెనీ బూటకపు హామీలకు పెట్టింది పేరన్న అమిత్‌ షా.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. నిరుద్యోగులకు నెలనెలా రూ.3వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు అమిత్‌ షా.

 

 

Read more RELATED
Recommended to you

Latest news