మీల్‌ మేకర్స్‌ వేటితో తయారు చేస్తారు..? తినడం ఆరోగ్యకరమేనా..?

-

మీల్‌ మేకర్స్‌తో మంచి మంచి రుచికరమైన స్నాక్స్‌ చేసుకోవచ్చు కదా..! మీల్‌ మేకర్స్‌తో ఏం ఏం చేసుకోవచ్చో మనకు తెలుసు కానీ.. అసలు మీల్‌ మేకర్స్‌ను ఎలా తయారు చేస్తారు. కొంతమంది వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు. రెండు ఒకటే..ఎక్కువ నాణ్యత ఉన్నవాటిని సోయా చంక్స్‌ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఇంతకీ వీటిని ఎలా తయారు చేస్తారంటే..

సోయా చిక్కుడు గింజల నుంచి ఆయిల్‌ను ముందుగా వేరుచేస్తారు. అప్పుడు సోయా పిండి మిగిలిపోతుంది. సోయా నూనెను తయారుచేస్తున్నప్పుడు ఏర్పడే ఉప పదార్థమే ఈ సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్‌గా మారుస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని చెప్పుకోవచ్చు. అందుకే పాశ్చాత్యదేశాల్లో సోయా మీట్ అని కూడా పిలుస్తారు. వీటని వెజ్‌ బిర్యానీలో వేస్తే అచ్చం చికెన్‌ పీస్‌లెక్కే ఉంటుంది.

మీల్‌ మేకర్స్‌ తినడం మంచిదేనా..?

వీటితో చేసిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.. గుండెజబ్బులు, క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారం తినని వారికి ఇది ఉత్తమ ఎంపిక. శక్తి బాగా అందుతుంది. వీటవి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొవ్వు శాతం పెరుగుతుంది. అందుకే వీటిని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మధుమేహం ఉన్న వారు హ్యాపీగా తినేయొచ్చు. వీటిని తింటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

మీల్‌ మేకర్స్‌తో ఏం ఏం చేసుకోచ్చు..

మీల్ మేకర్ కర్రీ వండుకోవచ్చు. కూరల్లో కలుపుగా వాడుకోవచ్చు. వంకాయ కూర, బంగాళాదుంప, క్యాబేజీ కూర, కాలీ ఫ్లవర్ కూర వండినప్పుడు వాటిల్లో కలిపేసి వండేయచ్చు. రుచి కూడా బావుంటుంది. వెజ్‌ బిర్యానీల్లోనూ వేసుకోవచ్చు. ఎలా అయితే తినడం కావాలి.

Read more RELATED
Recommended to you

Latest news