నోవాటెల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ

-

ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆయనకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఎయిర్ పోర్ట్ లో దిగిన అమిత్ షా కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ లు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక కాన్వాయ్ లో నోవాటెల్ హోటల్ కి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ టు చేవెళ్ల సభకు కాకుండా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్కు వెళ్లారు అమిత్ షా.. అక్కడ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చిస్తున్నారు. వాస్తవానికి అమిత్ షా షెడ్యూల్లో ఈ సమావేశం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన రోడ్డు మార్గాన చేవెళ్లకు వెళ్లి అక్కడ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ సడన్ గా ఆయన నోవాటెల్ హోటల్ లో పార్టీ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సమావేశం అనంతరం నోవాటెల్ హోటల్ నుంచి చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభకు అమిత్ షా బయలుదేరనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమయం దగ్గర పడుతోన్న సందర్భంలో అమిత్ షా ఈ సభలో ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. తాము కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సభ అనంతరం అమిత్ షా నేరుగా రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. కాగా ఈ సభను రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news