తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ కమెడియన్ పేరే రాళ్లపల్లి. ఈయన ఎక్కువగా జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన చిత్రాలలో నటించారు. ఇక ఆ నటనతోనే తనదైన శైలిలో మార్పును ఏర్పరుచుకున్నాడు. ఈయన ఎక్కువగా జ్యోతిష్యుడు, వంటవాడు, పోలీస్, నావికుడు వంటి పాత్రలు పోషించేవారు. ఈయన గొంతు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల చెవులలో వినిపిస్తూ ఉంటుంది అని చెప్పవచ్చు. ఆయన సినీ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాళ్లపల్లి కి ఇద్దరు కుమార్తెలు.. వారిలో పెద్ద అమ్మాయి రష్యాలో డాక్టర్ కోర్సు చేయడానికి వెళుతున్న సమయంలో మరణించడం జరిగింది. ఆమె పేరు మాధురి. తన తండ్రికి మంచి పేరు తేవాలని వైద్యరంగంలోకి అడుగుపెట్టడానికి రష్యా కి బయలుదేరింది. అయితే ఆమె వెలుతున్నప్పుడు ట్రైన్లో ఆమెకు వైరల్ ఫీవర్ సోకడంతో.. సమయానికి వైద్యం అందక ట్రైన్లోనే ప్రాణాలను కోల్పోయింది.
ఈ విషయం రాళ్లపల్లికి ఎంతగానో బాధించిందట. అయితే ఈమె భౌతికకాయాన్ని చెన్నై కి రప్పించడానికి అప్పట్లో ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు సహాయం చేశారట. మాధురి అకస్మాత్తుగా మృతితో రాళ్ళపల్లి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారట. తనకి తన కూతుర్లు అంటే చాలా అమితమైన ప్రేమ ఉండేది.. కొద్ది రోజుల తర్వాత ఆ దుఃఖాన్ని అంతా దిగమింగుకొని ఆయన తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కానీ ఆయన మాత్రం తన కూతురి మరణం తరువాత దుఃఖం లోనే ఉండిపోయారు. అంతే కాకుండా తన కూతురి మీద ప్రేమతోనే మాధురి అనే తన పేరుని తన వేసుకుని ప్రతి చొక్కా పైన కుట్టించుకునే వారట. ఈ విషయం తెలిసిన సినీ ఇండస్ట్రీలోని కొంత మంది ఈయనకు తన కూతురు అంటే ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అని తెలియజేశారు.