సాధారణంగా చిన్న పిల్లలు, జంతువులకు ఏం తినాలో..తినకూడాదో తెలీదు. తాజాగా ఒక ఏనుగు కూడా ఈ పనే చేసింది. ఆకలేస్తే ఏకంగా హెల్మెట్‌నే మింగేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు గుండా వెళ్తూన్న ఆ ఏనుగుకు హెల్మెట్‌ను చూడగానే నేరేడు పండులా నిగనిగలాడుతూ కనిపించిందేమో కానీ, దాన్ని చూడగానే లటుక్కున నోట్లో వేసేసుకుంది. దీన్ని చూసిన టూవీలర్ అతను నా హెల్మెట్ బాబోయ్ అంటూ తెగ బాధపడిపోయాడు.
అయితే, జంతు ప్రేమికులు మాత్రం ఏనుగు గురించి ఆలోచిస్తున్నారు. ఆ హెల్మెట్ గొంతులోనే ఇరుక్కుంటే ఆ ఏనుగు ప్రాణాలకు ముప్పు వాటల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన అసోంలో చోటు చేసుకుంది. గౌహతిలోని సత్‌గావ్ ఆర్మీ క్యాంప్‌లోక ఓ ఏనుగు ప్రవేశించింది. లోనికి వెళ్తూనే అది క్యాంప్‌లో పక్కన పార్క్ చేసి ఉన్న బైక్ మీద ఉన్న హెల్మెట్‌ను చూసింది. తొండంతో తీసుకుని నోట్లో వేసుకుని వెళ్లిపోయింది. కానీ, ఆ హెల్మెట్‌ను ఏనుగు పూర్తిగా మింగిదో లేదో తెలియదు.
ఒకవేళ దాన్ని మింగితే ఆ ఏనుగు అస్వస్థకు గురి అయ్యే ప్రమాదం ఉంది. క్యాంప్‌కు పక్కనే అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉండటంతో ఆహారం వెతుక్కుంటూ అప్పుడప్పుడు ఏనుగులు క్యాంప్‌లోకి ప్రవేశిస్తాయి.
ప్రస్తుతం ఈ ఏనుగు కూడా అలాగే వచ్చింది. దాని ఆహారం కోసం వెతుకులాటలో పాపం బాగా ఆకలి వేసిందోమో కానీ, హెల్మెట్‌ను పండనుకుని తినేసింది. ఆ హెల్మెట్ పోగొట్టుకున్న ద్విచక్రవాహనదారుడే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. కానీ, ప్రస్తుతం ఆ ఏనుగు ఎక్కడ ఉందో? దాని పరిస్థితి ఎలా ఉందో తెలియరాలేదు.