అమెరికాలో రెండు రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచంలో ఈస్తోనియా, సింగపూర్, ఇథియోపియా, ఫిన్లాండ్ సహా 21 దేశాలకు మహిళలే అధినేతలుగా ఉన్నారు. ఇలా అభివృద్ధి చెందని వాటి నుంచి చెందిన వాటి దాకా ఎన్నో దేశాలు మహిళలను ఉన్నత స్థానం పై కూర్చొబెడుతుంటే.. ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యంగా ప్రచారం చేసుకునే అమెరికా మాత్రం ఇప్పటివరకు ఆ అవకాశం అయితే ఇవ్వలేదు.
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రస్తుత వైస్ ప్రెడెంట్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ” మా అమ్మ శ్యామలా గోపాలన్ హారిస్ 19 ఏళ్ల వయసులో ఇండియా నుంచి అమెరికా వచ్చారు. ఆమె ధైర్యం, అంకిత భావం వల్లే ప్రస్తుతం నేనిలా ఉన్నా” అని ట్వీట్ చేశారు. అమెరికాలో ప్రవాస భారతీయ ఓటర్లు 26 లక్షల వరకు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ఈసారి అయినా అమెరికాలో మహిళకు పట్టం కడతారో లేదో వేచి చూడాలి మరీ.