కరోనాపై ఇండియా పోరాటం.. రాష్ట్రాలకు అడ్వాన్సులు.. పిల్లల కోసం 20శాతం బెడ్లు.

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తించింది. కరోనా ఎంత తీవ్రంగా ఉంటుందో రెండవ వేవ్ చూపించింది. ఈ నేపథ్యంలో మూడవ వేవ్ గురించిన భయాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ ఆందోళన పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉంటూనే ముందుచూపుతో వ్యవహరిస్తే, కరోనా అడ్డుకోవచ్చని కేంద్రం భావిస్తుంది. అందుకు తగినట్టుగా మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది.

కరోనా మూడవ వేవ్ రాకుండా ఉండేందుకు, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండకుండా చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జులై 9వ తేదీన 23వేల కోట్ల రూపాయల కోవిడ్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీని ఒక సంవత్సరంలోనే ఖర్చు చేయాలి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ఖర్చు మొత్తం జిల్లా స్థాయిలో కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ఉపయోగించబడుతుంది. ఇంకా అనేక చర్యలకు కేంద్రం సిద్ధపడింది. ఇందులో,

20శాతం పడకలు పిల్లలకు రిజర్వ్ చేయబడ్డాయి

కరోనా విస్తరించిన మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అంబులెన్సులు మండల స్థాయిలో పూర్తిగా లేవు. ఇప్పుడు దీనిపై కేంద్రం దృష్టి పెట్టింది. ప్రతీ మండలంలో అంబులెన్స్ సర్వీసులను ప్రవేశ పెట్టింది. ఆ ఖర్చు కేంద్రమే భరించనుంది. అంతే కాదు ఆక్సిజన్ ప్లాంటుల ఏర్పాటు కూడా జరగనుంది. అదీగాక పిల్లలపై కరోనా ప్రభావం ఉండకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా ప్రతీ ఆస్పత్రిలో శాతం పడకలు పిల్లల కోసం రిజర్వ్ చేయనున్నారు.

రాష్ట్రాలకు అడ్వాన్స్

కరోనాపై పోరాటంలో కేంద్ర నుండి రాష్ట్రాలకు అడ్వాన్సులు ఇవ్వబడ్డాయి. ఆగస్టు 13వ తేదీన 7500 కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యయాలు 60:40నిష్పత్తిలో ఉండనున్నాయి. ఈశాన్యంలో 90:10 నిష్పత్తిలో భాగస్వామ్యం చేయబడుతుంది. గతంలో జూలై 22 న ప్రభుత్వం రాష్ట్రాలకు రూ .1887.80 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది.

జిల్లా స్థాయిలో కరోనాను నివారించేందుకు కేంద్రం పథకాన్ని రూపొందించింది. రెండవ వేవ్ లో ఆక్సిజన్ లేకపోవడం, లాజిస్టిక్స్ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు మొత్తం 1755 ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో 500ప్లాంట్లు తయారీ దశలో ఉన్నాయి. అదీగాక 12సంవత్సరాల వయసు కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news