అక్కడ కాల్చిన శూలం తో ఒక్కసారి అలా చేస్తే కోరినకోర్కెలు వెంటనే నెరవేరుతాయి..

-

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కల్యాణ లోవ గ్రామంలో గల రెజర్వాయిర్ దగ్గర పదహారు వందల ఏళ్ల పాటు రాజుల పరిపాలన కొనసాగింది.ఇక ఆ కాలంలో కళ్యాణ లోవ కొండపై జాలువారిన పరమశివుని కన్నీటి చుక్కతో ఏర్పడినటువంటి ఆలయమే ఈ పోతురాజు స్వామి ఆలయం అని పూర్వీకులు చెబుతున్నారు. అదే ఈరోజు కళ్యాణ లోవ గా ప్రసిద్ధి చెందింది. పోతురాజు స్వామికి ఏడుగురు అక్క చెల్లెలు వున్నారు.. వారంతా ఒక్కో ప్రాంతంలో ఉన్నారు.భూలోకమ్మ తల్లి, కళ్యాణ లోవ పెద్దింటి అమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, అనకాపల్లి నూకాలమ్మ, తల్లి పాడేరు మోదకొండమ్మ తల్లి, ఒడిశా మజ్జిగరమ్మ తల్లి, మరిడిమాంబ తల్లి దేవతలకు .. పోతురాజు స్వామి సోదరుడు గా ఉంటారు. పోతురాజు స్వామి లోకంలో గల చెడును అంతం చేసి సృష్టిని కాపాడుతూ ఉంటారు..

బలి దానం చెయ్యడం ద్వారా పోతురాజు స్వామిని శాంతి, తృప్తిని కలుగుతుందిని దేవతలు అయిన అక్కచెల్లుళ్ళు చెప్తారు అని పురాణ చరిత్ర.. అలా ఇక్కడ ప్రతి శివరాత్రి రోజు సమయంలో ఏడుగురు అక్క చెల్లెళ్ళు తొమ్మిది రోజుల శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ వుంటారు. శివరాత్రి అనంతరం దేవతలు అయిన అక్కచెల్లుళ్ళను పోతురాజు స్వామి పసుపు కుంకమతో సాగనంపుతాడాని చరిత్ర చెబుతుంది..

ఇక ఆలయం పక్కనే పెద్దమ్మ తల్లీ ఆలయం కొలువై ఉంది..అమ్మవారిని దర్శించుకుని ఒక్కసారి ఆ శూలాన్ని తాకించుకుంటే.. కచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే.. పెద్దమ్మ తల్లి కి మొక్కి ఆ తల్లి దగ్గర దీప వెలుగులో చిన్న శూలం గుర్తు గల ఇనుప పట్టిని కాల్చి భక్తుల పొట్ట క్రీంద భాగం, నడుము కింద భాగాన శూలం గుర్తులు వేస్తారు. దానికోసం భక్తులు తాకిడి భారీగా ఉంటుంది. స్థానికంగా కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి ఎక్కడికి తరలి వస్తుంటారు జనం. ఇలా చేయడం వల్ల కచ్చితంగా మొక్కులు తీరుతాయని భక్తుల విశ్వాసం.. అందుకే చాలా మంది భక్తులు అక్కడికి వస్తారు..శూలం ముద్ర వేయించుకోవడానికి వేరే రాష్ట్రల నుంచి కూడా జనాలు భారీగా తరలి వస్తుండటం విశేషం…

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version