వైసీపీ పార్టీలో ఇక ఉండలేను – ఆనం సంచలన ప్రకటన

-

అధికార వైసీపీ పార్టీలో ఇక ఉండలేనని ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాజాగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి జగన్ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. ‘గడపగడపకు’ లో ఇప్పటివరకు అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే ఆనంకు జిఎస్డబ్ల్యూఎస్ కమిషనర్ మెసేజ్ పంపారు.

గడపగడపకు ఇకపై వెళ్లొద్దంటూ ఇన్ డైరెక్ట్ గా ఆనంకు సూచించారు. అయితే, దీనిపై ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైసీపీ పార్టీలో పరిణామాలపై ఆనం గరం గరంగా ఉన్నారు. తమను పక్కకు పెట్టడంపై రగిలిపోతున్న ఆనం.. చెప్పాల్సింది చాలా ఉందంటున్నారు ఆనం. సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ వైసీపీలో ఉండలేమని ఇప్పటికే ఆనం ప్రకటించారు. త్వరలోనే వైసీపీ పార్టీకి రాజీనామా కూడా చేసే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news